DMDK chief Captain Vijayakanth passes away : కోలీవుడ్ సూపర్ స్టార్ విజయకాంత్ తుదిశ్వాస విడిచారు. 71 ఏళ్ల వయసులో కరోనా బారిన పడిన విజయకాంత్, గురువారం చెన్నైలోని ఆసుపత్రిలో మరణించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్, డయాబెటిస్ కారణంగా మూడు కాలి వేళ్లను కూడా కోల్పోవాల్సి వచ్చింది.
హిజాబ్ పై కర్ణాటక ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు..
కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న విజయ్‌కి మొట్టమొదటి బ్రేక్ అందించింది విజయ్‌కాంతే. అలాగే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ విలన్‌గా మారిన సోనూ సూద్ కూడా విజయకాంత్ సినిమా నుంచే ఆరంగ్రేటం చేశాడు.
వైసీసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని NRI అరెస్ట్.. తల్లిని చూసేందుకు వస్తే..
ఒకే ఏడాదిలో 18 సినిమాలు రిలీజ్ చేసిన రికార్డు విజయకాంత్ సొంతం. తమిళ్లో 154 సినిమాలు చేసినా, వేరే భాషల్లో కనీసం గెస్ట్ రోల్ కూడా చేయని భాషాభిమాని విజయకాంత్. దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం పార్టీని స్థాపించిన విజయకాంత్, స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌కి ‘రమణ’ మూవీతో ఛాన్స్ ఇచ్చాడు. ఇదే మూవీ తెలుగులో ‘ఠాకూర్’గా మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ చేశాడు వీవీ వినాయక్.