Skanda Trolls : ‘అఖండ’ వంటి సూపర్ సక్సెస్ తర్వాత బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో కలిసి ‘స్కంద’ మూవీ చేశాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మాస్ ఇమేజ్ కోసం పరితపిస్తున్న చాక్లెట్ బాయ్ రామ్, ‘వారియర్’తో చేతులు కాల్చుకున్నాడు. ‘స్కంద’ మూవీ కూడా ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
బీడీ, బీడీ, బీడీ.. బీడీ తప్ప ‘గుంటూరు కారం’లో ఇంకో స్టిల్ లేదా గురూజీ..
అయితే పెద్దగా పోటీ లేకపోవడంతో దాదాపు రూ.60 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టిన ‘స్కంద’, డిజాస్టర్‌గానే మిగిలింది. తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిన ‘స్కంద’, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో మొదటి రోజు అత్యధిక మంది వీక్షించిన మూవీగా నిలిచింది. ‘స్కంద’ మూవీలో మిస్టేక్స్ పైన సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఓ సీన్లో డీజీపీని చంపేస్తాడు హీరో.
అదే షాట్లో అదే డీజీపీ, విలన్ వెనకాల నిల్చున్న గుంపులో కనిపిస్తాడు. క్లైమాక్స్ ఫైట్‌లో దీపపు కుండీలతో ఇద్దరు రౌడీలను ఎత్తి పడేస్తాడు రామ్. ఈ సీన్ స్లో మోషన్లో చూడగా రామ్ కాకుండా దర్శకుడు బోయపాటి శ్రీను ఉండడం క్లియర్‌గా కనిపించింది. సరిగా ఎడిటింగ్ చేయకుండా మూవీని తీసిన దర్శకుడిపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. దీనిపై తాజాగా స్పందించాడు రామ్ పోతినేని.
కేజీఎఫ్‌కి ముందు యష్ ఎవడు? అల్లు అరవింద్ కామెంట్..
‘22.04.23 ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. పీక్ సమ్మర్. ఎండలు మండిపోతున్నాయి. 25 రోజుల షెడ్యూల్లో మూడో రోజు ఈ ఎడిసోడ్ షూట్ చేస్తున్నాం. అప్పటికి నా కాలు బాగా పగిలిపోయి, రక్తం కారుతోంది. సరిగ్గా నడవడానికి కూడా రాలేదు. ఆ షాట్ సరిగ్గా రాకపోవడంతో నాకు రెస్ట్ ఇచ్చి, నా డైరెక్టర్ స్వయంగా ఆ షాట్ చేశాడు.
కంటెంట్ నచ్చడం, నచ్చకపోవడం పూర్తిగా ఆడియెన్స్ ఇష్టం. వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా. అయితే ఈ షాట్లో నా బాడీ డబుల్‌గా చేసిన నా డైరెక్టర్‌కి థ్యాంక్స్.. నా అభిమానుల కోసం నా రక్తాన్ని, చెమటను చిందించేందుకు సిద్ధంగా ఉన్నా.. ’ అంటూ ట్వీట్ చేశాడు రామ్ పోతినేని..
నో నట్ నవంబర్.. అసలేంటి NNN! ఆపుకోవడం మంచిదేనా..