Dunki Fake Box Office Collections : ‘యానిమిల్’ మూవీ కలెక్షన్స్ గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తమ్ముడు, ఆ చిత్ర నిర్మాతల్లో ఒక్కడైన ప్రణయ్ రెడ్డి వంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘బాలీవుడ్లో కార్పొరేట్ బుకింగ్స్‌తో థియేటర్లు నిండినట్టు చూపించుకుంటారు. మేం దానికి ఒప్పుకోలేదు. లేకపోతే ‘యానిమల్’ మూవీకి రూ.1000 కోట్ల కలెక్షన్లు వచ్చి ఉండేవి…’ అంటూ వ్యాఖ్యలు చేశాడు ప్రణయ్ రెడ్డి వంగా. ఈ కామెంట్స్ చేసిన నాలుగు రోజులకే ‘డంకీ’ విషయంలో కార్పొరేట్ బుకింగ్ మాఫియా బయటపడింది.
సలార్ vs డంకీ.. హద్దులు దాటుతున్న ఫ్యాన్ వార్! సినిమాల కోసం..
‘డంకీ’ సినిమాకి వివిధ కార్పొరేట్ కంపెనీలతో అగ్రిమెంట్ కుదిరింది. ఈ కంపెనీల వారి ఉద్యోగులకు ఉచితంగా ‘డంకీ’ మూవీ టికెట్లు పంపుతారు. ఉద్యోగులతో పాటు ఉద్యోగుల కుటుంబాలకు కూడా టికెట్లు బుక్ అవుతాయి. అయితే ఇలా బుక్ అయిన టికెట్లలో చాలా మంది థియేటర్లకు వెళ్లరు. ఫలితంగా థియేటర్ ముందు హౌస్ ఫుల్ బోర్డు ఉన్నా, థియేటర్ లోపల సగం మంది కూడా ఉండరు..
ఇప్పుడు ‘డంకీ’ విషయంలో ఈ కార్పొరేట్ బుకింగ్ జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌లో చాలా మల్టీప్లెక్సు థియేటర్లలో కూడా ‘డంకీ’ హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి కానీ థియేటర్లలో 20 శాతం మంది కూడా ఉండడం లేదు. అంతేకాకుండా ‘డంకీ’ మూవీని ప్రమోట్ చేసేందుకు, ‘సలార్’ మూవీని తక్కువ చేసి సోషల్ మీడియాలో పెయిడ్ మీమ్స్ ప్రత్యేక్షం అవుతున్నాయి. దీనికి కారణం కూడా బాలీవుడ్ మాఫియానే..
‘సలార్’ మూవీపై బాలీవుడ్ రాజకీయం.. ఆ దేశాల్లో ‘డంకి’ మూవీకి భారీగా థియేటర్లు..
‘సలార్’ మూవీకి మొదటి రోజు రూ.178 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. షారుక్ ‘డంకీ’ నాలుగు రోజులు కలిపి కూడా ఈ మార్కు టచ్ చేయలేకపోయింది. దీంతో బాలీవుడ్ పరువు కాపాడుకునేందుకు ఇలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ‘సలార్’ మూవీకి బీభత్సమైన క్రేజ్ ఉన్నా, నార్త్‌లో చాలా థియేటర్లలో ‘డంకీ’ మూవీని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.