Salaar vs Dunki : ప్రభాస్ నటించిన ‘సలార్’ అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొడుతూ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్, థియేటర్లకు క్యూ కడుతున్నారు. మూడు రోజుల్లోనే రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘సలార్’, భారీ కలెక్షన్లతో రూ.1000 కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతోంది.
‘సలార్’లో ఈ తప్పుని గమనించారా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచిపోయావ్ నీల్ మామ..
షారుక్ ఖాన్ ‘డంకీ’ సినిమాకి పోటీగా ‘సలార్’ విడుదలైంది. ‘డంకీ’ మూడు రోజుల్లో కలిపి రూ.152 కోట్లు వసూలు చేస్తే, ‘సలార్’ మొదటి రోజే రూ.178 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సరైన థియేటర్లు ఇవ్వకపోవడంతో హిందీ డబ్ వర్షన్ ‘సలార్’కి మొదటి రోజు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. అయితే రెండో రోజు, మూడో రోజు కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది ‘సలార్’..
మొదటి రోజు హిందీ వర్షన్లో రూ.16 కోట్ల వసూళ్లు రాగా, మూడో రోజు ‘సలార్’ కలెక్షన్లు రూ.28 కోట్లకు పైగా వచ్చాయి. అయితే చెన్నైలో మాత్రం సలార్ కలెక్షన్లు చెప్పుకోదగ్గట్టుగా లేవు. ‘లియో’ మూవీ కలెక్షన్లను దాటేస్తుందనే భయంతో తమిళ తంబీలు, ‘సలార్’ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే నార్త్ అమెరికాలో నాలుగో రోజు ‘డంకీ’ థియేటర్లు భారీగా పెరిగాయి. ‘సలార్’ మొదటి 3 రోజుల్లోనే ఇక్కడ 5 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది..
సలార్ vs డంకీ.. హద్దులు దాటుతున్న ఫ్యాన్ వార్! సినిమాల కోసం..
అయితే మూడో రోజు ‘సలార్’ నార్త్ అమెరికాలో 569 లోకేషన్లలో ప్రదర్శితమైతే, ‘డంకీ’ 610 లొకేషన్లలో ప్రదర్శితమైంది. దీంతో వసూళ్ల పరంగా ‘సలార్’ కంటే ‘డంకీ’ దాదాపు 1 లక్ష డాలర్లు ఎక్కువ వసూలు చేసింది. భారతీయులు, తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ‘సలార్’కి డిమాండ్ ఉన్నా, ‘డంకీ’ని ప్రదర్శిస్తున్నారు. అలాగే ‘డంకీ’ మూవీ కంటే ‘సలార్’ టికెట్ ధర దాదాపు డబుల్ ఉండడం కూడా సినిమా కలెక్షన్లు తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ప్రభాస్ మూవీని దెబ్బతీయడానికే ఇలా కుట్ర చేస్తున్నారని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్..