Delhi Air Pollution : నవంబర్ వచ్చిందంటే చాలు, ఢిల్లీలో జనాలకు ముక్కులో మంట మొదలైపోతుంది. ఒక్కసారిగా వాతావరణంలో తేమ పెరిగిపోయి, కాలుష్యం తారా స్థాయికి పెరిగిపోతూ ఉంటుంది. గత ఐదారేళ్లుగా ఇది కొనసాగుతూనే వస్తోంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదస్థాయిని తాకడంతో స్కూళ్లకు మరో వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది ఆప్ ప్రభుత్వం. 12వ తరగతి వరకూ నవంబర్ 10 వరకూ స్కూల్‌కి రావాల్సిన అవసరం లేదని, ఐదో తరగతి వరకైతే వాయు కాలుష్యం తగ్గేవరకూ ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశాడు ఢిల్లీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గోపాల్ రాయ్.
ఇప్పటికే ఢిల్లీలోని డీజిల్ ట్రక్కుల ఎంట్రీని బ్యాన్ చేశారు. అలాగే భవనాల నిర్మాణాలను కూడా తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా నోటీసులు జారీ అయ్యాయి. అలాగే సరి-బేసి సంఖ్యల రూల్‌ని కూడా తీసుకొచ్చేందుకు చూస్తున్నారు.
అంటే బండి నెంబర్ ప్లేట్ చివర సరి సంఖ్య ఉన్న బండ్లు సోమవారం బయటికి వస్తే, మంగళవారం కేవలం బేసి సంఖ్య నెంబర్ ప్లేటు బండ్లు మాత్రమే రోడ్డెక్కాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో 488గా చూపిస్తోంది. అంటే ఇది రోజుకి 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానం.