‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన మూవీ ‘యానిమల్’. రణ్‌బీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘యానిమల్’ మూవీలో ఊచకోత, రక్తం ఏరులై పారే సన్నివేశాలు, స్క్రీన్ ఎరుపెట్టే సీన్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీనికి A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అయితే A సర్టిఫికెట్ మూవీతోనే రూ.800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించి, దుమ్ముదులిపేశాడు సందీప్ రెడ్డి వంగా…
‘రోబో’ మూవీ, ఉపేంద్ర మూవీకి కాపీయా..? శంకర్ కంటే చాలా ఏళ్ల ముందే..
రష్మిక మంధాన, త్రిప్తి డిమ్రి, అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీ నటించిన ‘యానిమల్’ థియేటర్లలో దాదాపు 3 గంటల 21 నిమిషాల నిడివితో విడుదలైంది. ఈ మధ్యకాలంలో ఇంత లెంగ్త్ ఉన్న సినిమా రిలీజ్ కావడం ఇదే.. అయితే సినిమా కంటెంట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నటీనటుల నటనతో 3 గంటల 21 నిమిషాల సుదీర్ఘమైన సినిమా కూడా బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది..
క్రియేటివిటీ లేనప్పుడే హింస, సెక్స్ వాడతారు.. వైరల్ అవుతున్న ఆమీర్ ఖాన్ కామెంట్లు..
ఓటీటీలో మరో 11 నిమిషాల సీన్స్‌ని జత చేసి, రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగా. తొలుత 4 గంటలకు పైగా నిడివి ఉన్న ‘యానిమల్’ ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న సీన్స్నే ఓటీటీలోనూ ప్రసారం చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం తీసుకుంది. దీంతో 4 గంటల యానిమల్ మూవీ, అరగంట తగ్గింది…