వైసీసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని NRI అరెస్ట్.. తల్లిని చూసేందుకు వస్తే..

TDP NRI leader Yash Bodduluri Arrested by AP CID : సోషల్ మీడియా యుగంలో ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు స్వేచ్ఛ లభించింది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నాడనే ఉద్దేశంలో ఓ ప్రవాస ఆంధ్రుడిని అరెస్ట్ చేసిన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.

జైలుకి వెళ్లి వస్తే చాలు, సీఎం పదవి! అప్పుడు జగన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, నెక్ట్స్ బాబు..?

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యష్, ఉరఫ్ యశస్వి పొద్దులూరి.. కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ పనితీరుని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన వైసీసీ ప్రభుత్వం, అతనిపై చర్యలు తీసుకోవాలని అనుకుంది. కొన్ని రోజులు యష్ తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో తల్లిని పరామర్శించేందుకు యష్, ఇండియాకి వచ్చాడు..

AP Government :భారత్‌లో జనాలు అభివృద్ధి కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలనే కోరుకుంటారు

హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే ఏపీ సీఐడీ అధికారులు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్న యష్‌ని విచారణ చేయాలంటూ మంగళగిరికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు, సీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. యష్‌ అరెస్ట్ అప్రజాస్వామిక చర్య అంటూ, అతన్ని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post