BSE listed firm’s CFO Rinku Patel quits in viral handwritten resignation letter : ఆన్లైన్ యుగంలో ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. లీవ్ కావాలన్నా, ప్రమోషన్ పొందాలన్నీ అన్నీ ఈమెయిల్లోనే.. అయితే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) హోదాలో ఉన్న ఓ అధికారి, హోమ్ వర్క్ బుక్‌లో రాజీనామా లేఖ రాసి పంపడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పూరీ జగన్నాథ్ ఆలయంలోకి యూట్యూబర్.. అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్..
‘కొన్ని వ్యక్తిగత కారణాలతో నేను CFO పొజిషన్‌కి తక్షణమే రాజీనామీ చేస్తున్నా. మీ సంస్థలో పనిచేయడం నాకు చక్కని అనుభవాన్ని మిగిల్చింది…’ అని హోమ్ వర్క్ బుక్‌లో బ్లూ పెన్‌తో రాసి రాజీనామా పత్రాన్ని పంపించాడు రింకూ పటేల్ అనే వ్యక్తి. మిస్తీ ఇండియా అనే కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన రింకూ పటేల్ రాజీనామాని సంస్థ వెంటనే ఆమోదించింది. అతని స్థానంలో మరో వ్యక్తిని తీసుకోవడానికి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది..
సలార్ vs డంకీ.. హద్దులు దాటుతున్న ఫ్యాన్ వార్! సినిమాల కోసం..
హోం వర్క్ బుక్‌లో రాజీనామా లెటర్ రాసి పంపాడంటే ఇదేమీ చిన్న కంపెనీ కాదు. 28 ఏళ్ల క్రితమే BSE (బాంబే స్టాక్ ఎక్సేంజ్)లో లిస్ట్ అయిన మిస్తీ ఇండియా నికర విలువ రూ.20.22 కోట్లు.