Salaar: Part 1 – Ceasefire రివ్యూ: ‘బాహుబలి’ తర్వాత సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు ప్రభాస్. ‘సాహో’ పర్వాలేదనిపించినా, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ‘సలార్’పైనే ఆశలు పెట్టుకున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో ‘సలార్’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి ‘సలార్’ ఆ అంచనాలను అందుకోగలిగిందా..
డంకీ మూవీ రివ్యూ: రాజ్‌కుమార్ హిరాణీ మరో మాస్టర్ పీస్… షారుక్ హ్యాట్రిక్..
‘సలార్’ స్టోరీలో కొత్తదనం ఏమీ లేదు. దాదాపు కథ మొత్తం ట్రైలర్లో రివిల్ చేశాడు ప్రశాంత్ నీల్. ఖాన్సార్ అనే సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని శాసించే రాజు పొజిషన్ కోసం జరిగే కుట్రలు. ‘కేజీఎఫ్’ స్టైల్లో ఫస్టాఫ్‌లో కథను, పాత్రలను పరిచయం చేయడానికి వాడుకున్నాడు ప్రశాంత్ నీల్. ఖన్సార్ స్టోరీ సెకండాఫ్‌లో ఉంటుంది.
ముందుగా చెప్పినట్టుగానే కొన్ని సీన్స్, ‘ఉగ్రం’ మూవీ నుంచి రీమేక్ చేశాడు ప్రశాంత్ నీల్. దేవగా ప్రభాస్ క్యారెక్టర్, స్క్రీన్ ప్రెసెన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ‘రాధేశ్యామ్’,‘ఆదిపురుష్’లో ప్రభాస్‌ని చూసి తెగ ఫీలైపోయిన ఫ్యాన్స్‌కి, ఈ ‘సలార్’ ఓ జంబో బిర్యానీలాంటిదే.
బిగ్‌బాస్‌కి నాగ్ గుడ్‌బై! నెక్ట్స్ సీజన్ హోస్ట్ ఆ హీరోనట..
యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్. ఆరంభంలో 20 నిమిషాలు, ఆడియెన్స్‌ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లాడు ప్రశాంత్ నీల్. కోల్ మైన్ ఫైట్‌తో పాటు, ఇంటర్వెల్ సమయంలో 20 నిమిషాల యాక్షన్ బ్లాక్, నారంగ్ ఎపిసోడ్ అదిరిపోతాయి.
‘సలార్’ సినిమాకి ప్రాణం కూడా ఇవే. ఎమోషనల్ సీన్స్, జనాలకు ఎంత వరకూ కనెక్ట్ అవుతాయనేది ఆలోచించాల్సిన విషయం. రవి బసూర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మెయిన్ హైలైట్. ‘సలార్’ డైనోసార్ రేంజ్లో లేకపోయినా, ‘బాహుబలి’ తర్వాత చేసిన ప్రభాస్ చేసిన సినిమాల్లో ది బెస్ట్ అనిపిస్తుంది..
సలార్ vs డంకీ.. హద్దులు దాటుతున్న ఫ్యాన్ వార్! సినిమాల కోసం..
‘సలార్’ పార్ట్ 1 క్లిక్ అయితే సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పిన ప్రశాంత్ నీల్, టైటిల్ కార్డ్స్ సమయంలో ‘సలార్: శౌర్యంగ’ అంటూ సీక్వెల్‌కి హైప్ క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. మొత్తానికి ‘సలార్’ ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే రేంజ్లో ఉంటే, మిగిలిన వారికి ‘కేజీఎఫ్’ స్టైల్లో ‘ఉగ్రం’ చూసిన ఫీల్ కలిగిస్తుంది. అయితే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కటౌట్‌కి తగిన సినిమా చేశాడని మాత్రం ఒప్పుకోవాల్సిందే.