Malayalam Movies : కరోనాకు ముందు కరోనా తర్వాత అని జీవితాన్నే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా విభజించాల్సి వస్తుంది. అప్పటి వరకు ఓ మూస ధోరణికి అలవాటుపడ్డ సగటు సినిమా ప్రేక్షకుడు, కరోనా కాలంలో ఓటీటీ పుణ్యమా అని ప్రపంచ సినిమాను నాలుగు గోడల మధ్య చూడగలిగాడు. అందులో టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సినిమాలు మాలీవుడ్ మూవీస్.
యూట్యూబ్ స్టార్లతో సూపర్ హిట్లు! ఈ ఐడియా ఏదో భలేగా ఉందే..
మలయాళంలో ఫలానా సినిమా వచ్చిందని ఎవరో చెప్పారు.. నేను చూశాను, నువ్వు చూసావా.. మీరూ చూడండి.. అనే మాటలు ఈ మధ్య మనం తరచూ వింటున్నాం. మలయాళంలో ఓ కొత్త మూవీ వచ్చిందంటే చాలు ఆఫీస్ లలో, కాలేజ్ లలో, క్యాంటీన్ లలో, ఆఖరికి సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ.
ఇంతకీ ఎలా చూస్తున్నారు అంటే.. OTT లోకి వచ్చినప్పుడు Sub Title లేదా Multi Language ఆప్షన్ ఉంటుంది. అందులో ముందుగా మనకు అర్థం అయ్యే భాష కోసం వెతుకుతారు, లేదంటే.. ఉన్న దాంట్లోనే సినిమాకు భాష అక్కర్లేదు భావం అర్థమవుతే చాలు అని ప్రొసీడ్ అయిపోతున్నారు.
టాలీవుడ్ ఓ బిగ్ బాస్ హౌస్ అయితే వెంకటేష్ పక్కా సేఫ్ గేమ్ ప్లేయర్..
అయితే మలయాళం మూవీస్ కి టాలీవుడ్ లవర్స్ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు..? Answer Simple.. Tollywood ప్రేక్షకుడు ఎప్పటి నుంచో కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు కానీ మేకర్స్ ఇంకా అవే పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాలతోనే కోట్లు కొల్లగొడుతున్నారు. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అయినట్టూ..!
టాలీవుడ్ లో కాసులే లక్ష్యంగా సినిమాలు తీస్తారు తప్పా.. ప్రయోగాలు చేయరు. ఒకవేళ చేసినా Success అయినవి తక్కువే.. ఆదిపురుష్, భోళాశంకర్, వీరసింహారెడ్డి మొదలగు ఈ సినిమాలు.. చాలా పెద్ద ‘హిట్’ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పా చెప్పుకోదగ్గ కంటెంట్ ఏం ఉండదు ఇందులో.. భారీ బడ్జెట్ తో తీసిన సెన్స్‌లెస్ సినిమాలు కూడా టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి.
‘రోబో’ మూవీ, ఉపేంద్ర మూవీకి కాపీయా..? శంకర్ కంటే చాలా ఏళ్ల ముందే..
సినిమా అనేది ఓ మ్యాజిక్, 100% ఎవరినీ ఆకట్టుకోదు. కానీ కొందరి అభిప్రాయం ప్రకారం.. కొత్తగా ప్రయోగం చేయడం తప్పునే వాదన కూడా ఉంది. అందుకే మన దగ్గర రొట్ట సినిమాలే వస్తున్నాయి. ఇక నుంచైనా కమర్షియల్ హంగులు ఫుల్ స్టాప్ పెట్టి.. ప్రేక్షకులకు అభిరుచిని అర్థం కొత్త తరహా సినిమాలు చేస్తారేమో చూడాలి.