Salaar vs Dunki : సలార్, డంకీ వంటి రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్ల సమస్య రావడం సర్వ సాధారణం. ఈ సమస్య రాకూడదనే ఉద్దేశంతోనే డిసెంబర్ 22న విడుదల కావాల్సిన డంకీ, ఒక్క రోజు ముందుగానే రిలీజ్ అయ్యింది. అయితే నార్త్‌లో చాలా థియేటర్లలో డంకీకి అగ్రిమెంట్ జరిగింది..
సలార్ మూవీ ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం ఇదేనా..
డంకీ మూవీలో పీవీఆర్ ఛైయిన్స్ సంస్థ ఎండీ ఓ పాట కూడా పాడాడు. ఈ కారణంగానే సలార్‌కి ఎక్కువ థియేటర్లు ఇవ్వకుండా చాలా థియేటర్లలో డంకీనే ఆడిస్తున్నారు. దీంతో సలార్ వర్సెస్ డంకీ వివాదం మరింత ముదురుతోంది. సలార్‌కి నార్త్‌లో సరిపడా థియేటర్లు ఇవ్వకపోతే, సౌత్‌లో పీవీఆర్ ఛైయిన్స్లో ఈ మూవీని రిలీజ్ చేయమని ప్రొడక్షన్ సంస్థ స్పష్టం చేసింది..
ఇదిలా ఉంటే ‘డంకీ’ విడుదల కాగానే ‘డిజాస్టర్ డంకీ’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరికొందరు షారుక్ ఫ్యాన్స్ అయితే మొదటి షో కూడా జరగకుండానే ‘మాస్టర్ పీస్ డంకీ’ అని ట్రెండ్ వదిలారు. ‘సలార్’ రిలీజ్ తర్వాత కూడా ఇదే విధంగా రెండు రకాల ట్రెండ్స్ కనిపించడం ఖాయం..
సలార్ డార్లింగ్ ఫ్యాన్స్ దాహం తీరుస్తుందా..!?
అభిమానం ఉండడం తప్పు కాదు, కానీ అది హద్దులు మీరితేనే తప్పు. తెలుగు హీరోతో ఓ నార్త్ హీరో పోటీ పడితేనే పరిస్థితి ఇలా ఉంటే.. సంక్రాంతి బరిలో ఆరు సినిమాలు ఉన్నాయి. అన్నీ కూడా కాస్తో కూస్తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలవే. దీంతో అప్పుడు ఈ ఫ్యాన్స్ వార్ ఏ రేంజ్లో ఉంటుందో, ఎందరి ప్రాణాలు తీస్తుందోనని భయపడుతున్నారు సినీ జనాలు..