డంకీ మూవీ రివ్యూ: రాజ్‌కుమార్ హిరాణీ మరో మాస్టర్ పీస్… షారుక్ హ్యాట్రిక్..

Dunki Movie Review in Telugu : 2023 ఏడాదిలో ‘పఠాన్’, ‘జవాన్’ మూవీస్‌తో రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టాడు షారుక్ ఖాన్. వరుసగా రెండు సినిమాలతో రూ. 1000+ కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన షారుక్, ఇప్పుడు ‘డంకీ’ మూవీతో థియేటర్లలోకి వచ్చాడు..

20 ఏళ్ల తన కెరీర్‌లో 6 సినిమాలు మాత్రమే చేశాడు డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ. అయితే ప్రతీ మూవీ దేనికదే మాస్టర్ పీస్. రాజ్‌కుమార్ హిరాణా డైరెక్షన్‌లో షారుక్ నటిస్తున్నాడనగానే అంచనాలు పెరిగిపోయాయి. అయితే టీజర్, ట్రైలర్ పెద్దగా మెప్పించలేకపోయాయి..

సలార్ డార్లింగ్ ఫ్యాన్స్ దాహం తీరుస్తుందా..!?

ప్రభాస్ ‘సలార్’కి పోటీగా రిలీజ్ అయిన ‘డంకీ’ మూవీ ఎలా ఉంది? రాజ్‌కుమార్ హిరాణీ మరోసారి మ్యాజిక్ చూపించాడా? రాజ్‌కుమార్ హిరాణీ ఎంచుకునే కథలన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి. కేవలం ఎమోషన్స్‌ని కరెక్టుగా వర్కవుట్ చేసి, వాటిని మాస్టర్ పీసెస్‌గా మలుస్తాడు హిరాణీ. ‘డంకీ’ కూడా ఈ కోవకు చెందినదే..

ట్రైలర్‌లో చూపించినట్టే లండన్ వెళ్లాలనుకునే నలుగురు యువకులు, ఓ యువతి… ఇంగ్లీష్ రాక ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశారు. వాటిని అధిగమించి, లండన్ ఎలా చేరుకున్నారు? అక్కడ పడిన ఇబ్బందులు ఏంటి? తిరిగి స్వదేశానికి చేరుకోగలిగారా? అనేదే ‘డంకీ’ కథ.

రాజ్‌కుమార్ మరోసారి కామెడీని, ఎమోషన్స్‌ని కరెక్ట్‌గా మిక్స్ చేసి… ఆడియెన్స్‌ని నవ్విస్తూనే ఏడిపించేశాడు. విక్కీ కౌషల్ క్యారెక్టర్, ‘డంకి’ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. తాప్సీ పన్ను మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ చూపించింది. హర్డీ సింగ్ దిల్లాన్‌గా షారుక్ ఖాన్ నటన, కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులను ఏడిపించేస్తుంది..

సలార్ మూవీ ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం ఇదేనా..

షారుక్‌‌తో ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘త్రీ ఇడియట్స్’ మూవీస్ చేయాలనుకున్నాడు రాజ్‌కుమార్ హిరాణీ. అయితే ఈ రెండు సినిమాలను షారుక్ రిజెక్ట్ చేశాడు. ‘త్రీ ఇడియట్స్’ రేంజ్‌లో ‘డంకీ’ అందరికీ కనెక్ట్ కాకపోయినా, షారుక్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది..

ఓవరాల్‌గా ‘డంకీ’ మూవీతో షారుక్ హ్యాట్రిక్ హిట్టు కొట్టినట్టే, ఇక డైనోసార్ ‘సలార్’హిట్టు కొట్టాలంటే, ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రావడం తప్పనిసరి.

 

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post