America singer Mary Millben : బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మహిళా విద్యపై చేసిన కామెంట్లు పెను దుమారం రేపుతున్నాయి. ‘చదువు అయిపోయిన తర్వాతే అమ్మాయికి పెళ్లి చేయాలి. లేదంటే ప్రతీ రాత్రి భర్తతో పడుకోవాల్సి ఉంటుంది. మరో బిడ్డ పుడుతుంది. అదే అమ్మాయి బాగా చదువుకుంటే అమ్మాయి కడుపులో మోయడం కాదు, తయారు చేస్తుంది.. అందుకే రాష్ట్రంలో జననాల సంఖ్య తగ్గుతోంది..’ అంటూ వ్యాఖ్యానించాడు నితీశ్ కుమార్.
ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవలో తలదూరుస్తున్న అమెరికా.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..
ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, మహిళల గురించి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సబబు కాదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తన వ్యాఖ్యలపై బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాడు నితీశ్ కుమార్..
తాజాగా ఆఫ్రికన్-అమెరికా సింగర్ మేరీ మెల్బెన్ ఈ విషయంపై స్పందించింది. ‘ఈరోజు, బీహార్‌లో జరిగిన సంఘటన, దేశంలో మహిళా విలువకే ఛాలెంజ్. ధైర్యవంతులైన మహిళలు బయటికి వచ్చి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఇండియాలో పుట్టి ఉంటే నేను కచ్ఛితంగా బీహార్‌కి వెళ్లి, అక్కడ ముఖ్యమంత్రిపై పోరాడే దాన్ని..
కేజీఎఫ్‌కి ముందు యష్ ఎవడు? అల్లు అరవింద్ కామెంట్..
బీహార్‌లో జనాలకు మహిళలకు ఓటు వేసే అధికారం ఉంది. మార్పు కోసం ఓటు వేయండి..’ అంటూ ట్వీట్ చేసింది మేరీ మెల్బెన్.
మేరీ మెల్బెన్, మొదటి నుంచి ప్రధాని మోదీ సపోర్టర్‌గా ఉంది. ‘నాకు ఇండియా అంటే ఇష్టం. ఇండియాకి సరైన లీడర్ నరేంద్ర మోదీయే అని నా ఉద్దేశం. ఆయన యూఎస్- ఇండియా సంబంధాలను పెంచేందుకు, గ్లోబల్ ఎకానమీ పెంచేందుకు బెస్ట్ లీడర్. ముఖ్యంగా మోదీ, మహిళా పక్షపాతి..’ అంటూ చెప్పుకొచ్చింది మేరీ మెల్బెన్.
లార్డ్ కృష్ణ మంత్రాలు నేర్చుకుంటున్న అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థులు..