Beetroot Side Effects : భూమిలో పండే బీట్‌రూట్ ఎన్నో రకాల పోషకాలను సంగ్రహిస్తుంది. బీట్‌రూట్ లో విటమిన్లు, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ యొక్క అద్భుతమైన మూలం. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. కణాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. అయితే బీట్‌రూట్ తినడం వల్ల లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక లక్షణాలతో బాధపడుతున్నవారు బీట్‌రూట్ తినకూడదు. అయితే ఎలాంటి సమయాల్లో బీట్‌రూట్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65..
* మలం రంగు మార్పు:
బీట్‌రూట్ లేదా ఎరుపు రంగు కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, మనలో బీటూరియా లక్షణాలను అభివృద్ధి చెందుతాయి. బీట్‌రూట్ రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం లేదా మలం ఎర్రగా మారడాన్ని బీటూరియా అంటారు.
* కడుపు నొప్పి: కొందరికి బీట్‌రూట్‌ను తీసుకున్న తర్వాత కడుపులో అసౌకర్యం, గ్యాస్ లేదా ఉబ్బరం అనిపించవచ్చు. ప్రత్యేకించి వారు ఎక్కువ ఫైబర్ కలిగిన ఆహారాన్ని అలవాటు చేసుకోకపోతే అలా జరుగుతుంది.
* కిడ్నీ స్టోన్స్ :
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీట్‌రూట్ తినడం హానికరం. బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది, దీని కారణంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.
* రక్తపోటు తగ్గడం: తక్కువ రక్తపోటు ఉన్న వ్యక్తులు బీట్‌రూట్ తీసుకుంటే.. అది వారి రక్తపోటును మరింత తగ్గిస్తుంది.
కమ్మనైన కర్ణాటక బిసిబెలే బాత్..
* అలెర్జిక్ రియాక్షన్స్ : కొన్ని సందర్భాల్లో కొందరికి ఈ బీట్రూట్ దుంపలవల్ల అలెర్జీ రావొచ్చు లేదా అలెర్జీ దురద మంటగా అనిపించవచ్చు. ఇది దురద, దద్దుర్లు లేదా వాపు వంటి లక్షణాలకు దారితీస్తుంది.
* కాల్షియం లోపం : బీట్‌రూట్ రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. తక్కువ కాల్షియం స్థాయిలు ఉన్న మహిళలు బీట్‌రూట్ జ్యూస్‌ను ఎక్కువగా తీసుకోకూడదు.
* గర్భధారణ సమయంలో : ఎక్కువ నైట్రేట్ తీసుకునే గర్భిణీ స్త్రీలకు శక్తి లోపించడం, తలనొప్పి, కళ్లు తిరగడం, కళ్లు, నోరు, పెదవులు, చేతులు మరియు కాళ్ల చుట్టూ నీలిబూడిద చర్మం ఏర్పడవచ్చు.
* ఈ మందులుతో : బీట్రూట్ లో నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొన్ని మందులతో తీసుకోవటం వల్ల సంకర్షణకి గురవుతాయి. ప్రత్యేకించి అంగస్తంభన, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు డాక్టర్ ని సంప్రదించి తీసుకోవడం మంచిది.
పాలిచ్చే తల్లులు తీసుకువాల్సిన ఆహారం..