Two Years of Allu Arjun Pushpa : ‘పుష్ప’ మూవీతో టాలీవుడ్ హీరో బన్నీ, పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. టాలీవుడ్ నుంచి రాజమౌళితో సినిమా చేయకుండా పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్టు కొట్టిన మొట్టమొదటి హీరో అల్లు అర్జున్. సుకుమార్ క్రియేట్ చేసిన ‘పుష్ప’, ఎలాంటి ప్రమోషన్ లేకుండా హిందీలో రిలీజ్ అయ్యింది. పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అయితే హిందీ డబ్బింగ్ వెర్షన్ రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది.
రేంజ్ పెంచేస్తున్న అల్లు అర్జున్… ‘పుష్ప’ తర్వాత తగ్గేదే లే! త్రివిక్రమ్‌తో సినిమాకి..
ఈ సినిమా రిలీజై అయ్యి, నేటికి రెండేళ్లు. ఈ మూవీలో ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్‌తో మూవీలో చాలా సీన్స్‌ని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించారు. అడవి మధ్యలో జరిగిన ఈ షూటింగ్ కోసం రోజు 300 వాహనాలను ఉపయోగించేవారట..
ఓ ఫైట్ కోసం దాదాపు 1500 మంది ఫైటర్లు, చిత్ర యూనిట్, స్టాఫ్, టెక్నికల్ సిబ్బంది.. మారేడుమిల్లి ఫారెస్ట్‌కి చేరుకున్నారు. ‘దాక్కో దాక్కో మేక’ పాట కోసం 1000 మంది డ్యాన్సర్లను ఉపయోగించారట. అంతేకాదు ఈ మూవీ కోసం ఓ ఎర్ర చందనం ఫ్యాక్టరీయే స్థాపించాల్సి వచ్చింది.
అల్లు అర్జున్ రైట్ హ్యాండ్ కేశవ అరెస్ట్.. జూనియర్ ఆర్టిస్ట్‌ని బ్లాక్ మెయిల్ చేసి..
గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తున్న సీన్స్‌ని చిత్రీకరించేటప్పుడు పోలీసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇలా కాదని, ఓ ఎర్రచందనం ఫ్యాక్టరీని తీసుకుని.. స్వేచ్ఛగా షూటింగ్‌ని ముగించారు. ఆంధ్రా ఏరియాలో ‘పుష్ప’ సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్ కంటే ఈ ఫ్యాక్టరీ ద్వారా ఎక్కువ లాభాలు వచ్చాయని టాక్..