Farmers Suic*de in India :
ఇంకెక్కడి రాజు…!
మనకు తిండి పెట్టి, తాను నీళ్లు తాగి కడుపు నింపుకున్నప్పుడే.. మన దేశంలో రైతు పరిస్థితేంటో అర్థమవుతుంది. కానీ నమ్మడానికే ఎవరికీ తీరికలేదు. తీరిక ఉన్నా అవసరం లేదు. మన అవసరం తీర్చే, ఆహ్ కాదు.. మన అవసరం, మన ఆకలి తీర్చే రాజు శ్రమించి విశ్రమించే చెట్టుకే వేల్లాడుతున్నా… Ac, Fanల కింద కూర్చున్న మనమే రాజులం! రైతులకు చనిపోవడం కొత్త కాదు కానీ, అవి సహజ మరణాలు కాదు.
దొంగ చేతికి తాళాలివ్వడం అంటే ఇదే..
ఈ నిర్లక్ష్య సమాజం చేస్తున్న Haత్యలు. ఎన్నో ఓదార్పు యాత్రలు, ఇంకెన్నో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన Haత్యలవి. ఇక్కడ రక్తం చిందదు, మట్టి అంటదు కానీ ప్రాణం పోతుంది. ఇప్పుడు జరిగిన ఒక Haత్య వల్ల కొన్ని వందలమందికి తిండి దొరకక, మరెన్నో ఆకలి చావులకు కారణమవుతుంది. గుర్తు పెట్టుకోండి.. పండిచేవాడు ఉంటేనే మీ పళ్లెంలోకి అన్నం వస్తుంది.
మీరు సంపాదించేది రూపాయిలైనా.. కోట్లయైనా రైతు ప్రకృతి ఆరోగ్యంగా ఉన్నంత వరకే.. మీరు అనొచ్చు.. రైతు ఏమైనా తక్కువ తిన్నాడా.. ప్రమాదకరమైనా పురుగు మందులు వాడటం లేదా అని, ఆకలి చావులు నుంచి బతికి వచ్చిన మనందరం ఆ రైతు నీడలో పెరిగిన మొక్కలమే. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక తరం రైతులు మన వెంటే ఉన్నారు. ఒక బస్తా వడ్లు రూపాయికి రెండు రూపాయిలకు అమ్మిన ఆ చరిత్రలో మన మూలాలు ఎక్కడికీ పోవు.
అప్పటి నుంచి ఇప్పటికీ.. రైతులను అనాగరికులు, చదువు లేనివాళ్లు చేసుకునే పనిలానే చూస్తున్నారు. వాళ్ళ కష్టానికి ముష్టి పడేసారు. కష్టపడినప్పుడు ఫలితం దక్కదు, ఫలితం దక్కనప్పుడు రెట్టింపు ధాన్యల కోసం ప్రభుత్వంచే గుర్తిచబడ్డ రసాయన పంటలు ఈరోజు మీ చేతిలో ముద్దగా మారాయి, మారుతున్నాయి, మారుతుంటాయి.. రైతు విలువ తెలిసే వరకు!
ఒక రైతు తను కష్టపడి పడించిన టమోటకి మంచి ధర రాక, కొనేవాళ్ళు లేక, ఐదు రూపాయలకు కిలో చొప్పున రోడ్డు మీద పోసి అమ్ముకుంటుంటే.. కేజీ.. రూపాయికి, రెండు రూపాయిలకు ఇస్తావా అని బేరం ఆడే మనం..
హాస్పిటల్ లో మాత్రం లక్షలకు లక్షలు బిల్లులు అన్నీ మూసుకుని కడతాం.
ఈ దౌర్భాగ్యమే రైతును ఆశావాదిని చేసింది. అప్పు చేసి మరి పంటలకు పురుగుల మందులు వేస్టే.. పండించిన పంటకి గిట్టుబాటు రాకపోతే.. ఆ రైతుకు మిగిలేది గూగుల్ లో రైతుల ఆత్మ Haత్యల లిస్ట్ లో ఓ నంబర్ మాత్రమే . .
లేని విలువైన జీవితం రైతుది..