Bigg Boss 7 : భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సూపర్ హిట్టైన టీవీ ప్రోగ్రామ్ ‘బిగ్‌బాస్’ (Bigg Boss). కొందరు సెలబ్రిటీలను, సెలబ్రిటీలమని చెప్పుకునే మరికొందరిని పట్టుకొచ్చి ఓ పెద్ద ఇంట్లో కొన్నాళ్లు పెట్టడం, వాళ్ల మధ్య జరిగే గొడవలు, స్నేహాలు, మోసాలు, వింత వింత పోటీలు, ఏడుపులు, రొమాన్స్, రచ్చ మొత్తం కెమెరాల్లో బంధించి, ప్రేక్షకులకు వినోదం పంచడమే ‘బిగ్ బాస్’ కాన్సెప్ట్..
‘ఆదికేశవ’ రిజల్ట్‌తో శ్రీలీల స్పీడ్‌కి బ్రేకులు, మరో కృతి శెట్టి కాదుగా..
తెలుగులో ‘బిగ్ బాస్’ సీజన్ 7 మొదలవుతుంటే, హిందీలో ఇప్పటికే 16 సీజన్లు పూర్తి చేసుకుంది ఈ రియాలిటీ ప్రోగ్రామ్. తెలుగులో ‘ఎన్టీఆర్’ (Jr NTR) హోస్ట్‌గా సీజన్ 1 జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్లేస్‌లో ‘నాని’ (Nani) వచ్చాడు. రెండో సీజన్‌లో కౌషల్ ఆర్మీ పేరుతో ఓ వర్గం, నానిపై ఓ రేంజ్‌లో సోషల్ అటాక్ చేసింది. ఈ దెబ్బకు ఎంత ఇచ్చినా మళ్లీ టీవీ ప్రోగ్రామ్ చేయనని తేల్చి చెప్పేశాడు నేచురల్ స్టార్ నాని..
మూడో సీజన్ నుంచి నాగార్జున (Akkineni Nagarjuna), ‘బిగ్ బాస్’ ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. సీజన్లు గడిచే కొద్దీ, తెలుగు ‘బిగ్ బాస్’ ప్రోగ్రామ్‌కి వచ్చే టీఆర్‌పీ తగ్గుతూ వస్తోంది. అందుకే టైమింగ్స్ కూడా మారుతూ పోతున్నాయి. ‘బిగ్ బాస్’ ప్రోగ్రామ్ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుందని చాలామంది సెలబ్రిటీలు కామెంట్లు చేశారు. అందుకే ఈ ప్రోగ్రామ్‌లో కంటెస్టెంట్స్ చేసే పనులన్నీ కెమెరా ముందు నటించడం లాంటివేనని అంటారు చాలామంది.
చైయిన్ స్మోకర్ మహేష్, ఆ అలవాటు ఎలా మానేశాడు! ‘గుంటూరు కారం’ కోసం నిజంగానే..
‘బిగ్ బాస్’ రియాల్టీ షోలో నిజమెంత? ‘బిగ్ బాస్’ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుందనే వాదనలో నిజం లేదు. అలాగని పూర్తిగా అబద్ధం కూడా కాదు. జనాల రియాక్షన్‌ని బట్టి, ఎవరిని టార్గెట్ చేయాలి? ఎవరిని ఎలిమినేషన్స్ లిస్టులో పెట్టాలనేది కంటెస్టెంట్స్‌కి ముందుగానే సమాచారం అందుతుంది. అలాగే ఏ కంటెస్టెంట్ ఏ డ్రెస్సు వేసుకోవాలి? ఏ రేంజ్‌లో అందాలు కనిపించేలా గ్లామర్ ఒలికించాలనేది కూడా ‘బిగ్ బాసే’ డిసైడ్ చేస్తాడు.
SSMB29 కోసం సూపర్ స్టార్ కి జక్కన్న కండీషన్స్..
అలాగే పేరుకి ‘లైవ్’ అని చెప్పినా ఓటీటీలో ప్రసారమయ్యే వీడియో కూడా ఎడిట్ చేసిన తర్వాత రిలీజ్ చేసేదే..