యూట్యూబ్ స్టార్లతో సూపర్ హిట్లు! ఈ ఐడియా ఏదో భలేగా ఉందే..

Youtube stars : సోషల్ మీడియా యుగంలో టాలెంట్ ఉంటే చాలు, దాన్ని ప్రదర్శించుకోవడానికి అనేక మార్గాలు. అందులో ఒకటి యూట్యూబ్. యూట్యూబ్ కారణంగా స్టార్లుగా మారిన వాళ్లు ఎందరో. రాజ్ తరుణ్, ప్రియాంక జవల్కర్, కిరణ్ అబ్బవరం, చాందని చౌదరి, వైష్ణవి చైతన్యలాంటి వాళ్లంతా యూట్యూబ్‌లో కెరీర్ మొదలెట్టినవాళ్లే..

లంగా ఓణీలలో మెరుస్తున్న సినీ పూబోణి..

ఇప్పుడు ఈ లిస్టులో అలేఖ్య హారికా కూడా చేరిపోనుంది. ‘దేత్తడి’ హారికగా యూట్యూబ్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది ఈ పిల్ల, ‘బిగ్‌బాస్’ షోలో కూడా పాల్గొంది. బిగ్ బాస్‌ ప్రోగ్రామ్‌లో ఫైనలిస్టుగా నిలిచిన హారిక, సంతోష్ శోభన్ సరసన హీరోయిన్‌గా మూవీ చేయనుంది.

Youtube stars
Vaishnavi Chaitanya, Dethadi Harika

‘బేబీ’ మూవీ దర్శకుడు సాయి రాజేశ్, ఈ లవ్ స్టోరీకి కథను అందిస్తున్నాడు. సుమన్ పతూరి దర్శకత్వం చేయబోతున్న ఈ మూవీని, ‘బేబీ’ నిర్మాత ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కలిసి నిర్మిస్తున్నారు. ఇంతకుముందు సాయి రాజేశ్ కథను అందించి, నిర్మాతగా వ్యవహరించిన ‘కలర్ ఫోటో’, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది.

‘కలర్ ఫోటో’ మూవీలో కూడా యూట్యూబ్ నుంచి వెండితెరపైకి వచ్చిన సుహాస్, చాందిని చౌదరి, హర్ష, దివ్య శ్రీపాద ముఖ్యపాత్రల్లో నటించడం విశేషం. కొత్త నటీనటులను తీసుకుని, వారికి నటన నేర్పించి పరిచయం చేయడం చాలా రిస్క్. యూట్యూబ్ స్టార్లు అయితే అప్పటికే యాక్టింగ్ అనుభవం ఉంటుంది, జనాల్లో పాపులారిటీ కూడా ఉంటుంది. కాబట్టి థియేటర్లకు జనాలను రప్పించడం చాలా తేలిక.

‘బేబీ’ని నిజంగా Cult Classic అనొచ్చా..!?

‘తను నేను’ సినిమాతో హీరోగా మారిన సంతోష్ శోభన్, ‘పేపర్ బాయ్’, ‘ఏక్ మినీ కథ’, ‘మంచి రోజులొచ్చాయ్’, ‘లైక్ షేర్ & సబ్‌స్కైబ్’, ‘కళ్యాణం కమణీయం’, ‘శ్రీదేవి శోభన్‌బాబు’, ‘అన్నీ మంచి శకునములే’, ‘ప్రేమ్ కుమార్’ ఇలా వరుస సినిమాలైతే చేస్తున్నాడు కానీ సరైన బ్రేక్ దొరకడం లేదు. మరి అలేఖ్య హారికతో లవ్ స్టోరీ అయినా మనోడి ఫేట్ మారుస్తుందేమో చూడాలి.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post