Pindam Movie Review : ఒకప్పుడు హర్రర్ మూవీ అంటే నైట్ షో చూసేందుకు భయపడి చచ్చేవాళ్లు జనాలు. అయితే ఈ మధ్య ట్రెండ్ మారింది. కేవలం భయపడితే థియేటర్‌కి వచ్చే జనాల సంఖ్య తక్కువగా ఉందని, హర్రర్ కామెడీ ఫార్ములాని ఎంచుకున్నారు. అయితే చాలా రోజుల తర్వాత కామెడీని టచ్ చేయకుండా వచ్చిన హర్రర్ మూవీ ‘పిండం’.
సలార్ మూవీ ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం ఇదేనా..
అప్పుడెప్పుడో ‘ఒకరికి ఒకరు’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కోలీవుడ్‌కి వెళ్లిపోయిన శ్రీరామ్ ఉరఫ్ శ్రీకాంత్ ఇందులో హీరో. 2021లో ‘అసలేం జరిగింది’ పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తీసిన శ్రీరామ్, అసలు ఆ మూవీ ఒకటి థియేటర్లలోకి రావడం జరిగిందనే విషయాన్ని కూడా ప్రేక్షకుల దాకా చేర్చలేకపోయాడు.
ఈ వారం పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో ‘పిండం’ మూవీకి కాస్త ప్రమోషన్ దక్కింది. సినిమా రిలీజ్‌కి ముందు చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో పాల్గొని బాగానే హడావుడి చేసి, ఈ మూవీ రిలీజ్ అవుతుందనే విషయాన్ని కొంతమందికైనా చేర్చగలిగారు.
కథ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ఓ పాత ఇంటిని కొనుగోలు చేసి హీరో. అందులో వారికి ఎదురయ్యే సంఘటనలు. ‘పిండం’ టైటిల్ చూడగానే కథ ఏంటనేది అంచనా వేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్‌తో భయపెట్టే సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి. హర్రర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకి ఈ మూవీ కచ్ఛితంగా నచ్చుతుంది.
Hi నాన్న మూవీ రివ్యూ: నాని ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్…
అయితే 2 గంటలకు పైగా సినిమా ఉండకపోతే బాగోదనే ఉద్దేశంతో కొన్ని సీన్స్ సాగతీసి అనిపిస్తాయి. ఈజీగా 20 నిమిషాల నిడివి తగ్గించవచ్చని అనిపిస్తుంది. మొత్తంగా థియేటర్లో డీటీఎక్స్లో హర్రర్ మూవీ చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలనుకునేవారికి ‘పిండం’ మంచి ఛాయిసే..