YS Jagan Comments on Pawan Kalyan and Barrelakka : బర్రెలక్కగా పాపులారిటీ దక్కించుకున్న కర్నే శిరీష, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజిక వర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది. ఈ సమయంలో నామినేషన్ ఉపసంహరించుకోవాల్సిందిగా బెదిరిస్తూ, ఆమెపైన కొందరు దాడులు కూడా చేశారు. దాడులకు బయపడకుండా ఆమె పోటీలో నిలిచింది..
పార్లమెంట్లోకి చొరబడిన ఇద్దరు దుండగులు.. టియర్ గ్యాస్ రిలీజ్ చేసి..
శీరిషకు ఎంతో మంది మద్ధతుగా నిలిచారు. ఆమె కోసం సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ కూడా చేశారు. మొత్తంగా 5700+ ఓట్లు దక్కించుకున్న బర్రెలక్క, డిపాజిట్ కూడా కోల్పోయింది. అయితే ఒక్క రూపాయి కూడా పంచకుండా, కేవలం సోషల్ మీడియా ప్రచారంతో ఇన్ని ఓట్లు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఫ్రీ అంటే వాడకుండా ఊరుకుంటారా.. పనీపాటా లేకపోయినా బస్సు ఎక్కేస్తున్న మహిళలు..
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా బర్రెలక్క గురించి ప్రస్తావించాడు. ‘ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని పవన్ కళ్యాణ్, తెలంగాణ ఎన్నికల్లో డైలాగులు కొట్టాడు. ఆంధ్రాకు వ్యతిరేకంగా డైలాగులకు తెలంగాణలో ఆయనకి పడిన ఓట్లు ఎన్నో తెలుసా… అక్కడ ఇండిపెండెంట్గా పోటీచేసిన నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ప్యాకేజీ స్టార్ పార్టీకి రాలేదు’ అంటూ వ్యాఖ్యానించాడు జగన్. విషయం ఏదైనా, ఓ మారుమూల గ్రామంలో జన్మించిన బర్రెలక్క, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావించే స్థాయికి ఎదగడం అంటే శిరీష ఇకపై సెలబ్రిటీ కిందే లెక్క.