Biden to Skip India’s Republic Day Celebration : వచ్చే నెలలో జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హాజరు కాకపోవచ్చని సమాచారం. జనవరిలో జరుగనున్న క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌ను నిర్వహణలో భాగంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు భారత్ ఆహ్వానించింది. అయితే, రిపబ్లిక్ డే మరియు జనవరిలో జరిగే క్వాడ్ సమ్మిట్‌కు అధ్యక్షుడు బిడెన్ రాలేరని తెలుస్తుంది.
రాత్రికి రాత్రే పతనమైన ఇన్ఫోసిస్ షేర్లు..
భారతదేశం అన్ని క్వాడ్ దేశాల అధినేతలను ఆహ్వానించింది. అయితే, క్వాడ్ సదస్సుకు సంబంధించిన తేదీలను సవరించాలని భావిస్తున్నామని, ప్రతిపాదిత తేదీల్లో అన్ని భాగస్వామ్య దేశాలు సదస్సుల్లో పాల్గొనే అవకాశం లేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. క్వాడ్ సమ్మిట్ 2024 తర్వాత నిర్వహించాలని ప్రతిపాదించబడింది.
ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన పాకిస్తాన్..
న్యూయార్క్‌లో సిక్కు వేర్పాటువాద నాయకుడిని హతమార్చే ప్రయత్నంలో భారత ప్రభుత్వ ఏజెంట్ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఇటీవల అమెరికాతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాలు ఈ సమస్యను మృదువుగా పరిష్కరించడానికి ప్రయత్నించాయి. క్వాడ్‌లో భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ ఉన్నాయి.