Tollywood Star Hero : ఫిల్మ్స్ ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ కొందరిని మాత్రమే అందరూ గుర్తుంచుకుంటారు. కళామాతల్లి కూడా తన బిడ్డల్ని చూసి గర్వపడే స్థాయిలో కొందరుంటారు అందులో ముందు వరుసలో ఉంటారు. నందమూరి తారాక రామారావు, మెగాస్టార్ చిరంజీవి. కొందరికి సినిమా అవసరం కానీ కొందరు సినిమాకి అవసరం. వీరిద్దరూ తెలుగు సినిమా స్థాయిని పెంచి గొప్ప నటులు. అంతకు మించి మనసున్న మనుషులు.
క్రియేటివిటీ లేనప్పుడే హింస, సెక్స్ వాడతారు.. వైరల్ అవుతున్న ఆమీర్ ఖాన్ కామెంట్లు..
నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగాడు. తెలుగు వెండితెర ఆరాధ్య దైవమయ్యారు. మనం ఎవరం రాముడు, కృష్ణుడిని చూడలేదు కానీ రామరావులో దేవుడిని చూసుకున్నారు తెలుగు ప్రేక్షకులు. దానవీర శూరకర్ణలో మూడు పాత్రలు, ఐదు విభాగాల్లో పని చేసి అందరిని అలరించారు. పౌరాణిక చిత్రాల్లో తిరుగులేని నటుడుగా ఎదిగారు.
ఒకపక్క ఇండస్ట్రీలో రామారావు, నాగేశ్వరరావు ఓ వెలుగు వెలుగు వెలుగుతున్న సమయంలోనే కొణిదెల శివకుమార్ అనే కుర్రాడు మొగల్తూరు నుంచి మద్రాసులో అడుగుపెట్టి నేడు మెగాస్టార్ గా ఎదిగాడు. చిరంజీవి మొదట నటించిన చిత్రం ‘పునాదిరాళ్లు’ అయినప్పటికీ ‘ప్రాణం ఖరీదు’ ముందు రిలీస్ అయింది. చిరు ఇప్పటికి 150కి పైగా సినిమాల్లో నటించాడు. ఇన్ని దశాబ్దాల ప్రయాణంలో చిరు చూడని హిట్లు లేవు, ఫ్లాపులు లేవు.
నాని ‘హాయ్ నాన్న’ సినిమాని తొక్కేస్తున్న దిల్ రాజు..
సినీ డాన్సుకి డెఫినేషన్ చెప్పిన నటుడు చిరంజీవి. మనం ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పిలుచుకునే ప్రభుదేవా కూడా తన ఫెవరట్ డాన్సర్ చిరంజీవి అనే చెప్తాడు అంటే అర్థం చేసుకోచ్చు చిరు డాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో.. యాక్టింగ్ లో చిరు ఈజ్, డాన్స్ లో ఆయన చరిష్మా ఎవరికి రాదనే చెప్పవచ్చు. 80’s, 90’s లో చిరంజీవి సినిమా ఇండస్ట్రీని ఏలాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎంతోమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
అయితే మెగాస్టార్ తర్వాత స్థానం ఎవరిదీ అంటే మాత్రం చెప్పడం కష్టం..! చిరు కొంత గ్యాప్ ఇచ్చి.. రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ ఆ స్టార్ హీరో కుర్చీని ఎవరు సొంతం చేసుకోలేకపోయారు. మెగాస్టార్ తర్వాత అంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే.. పవన్ దృష్టి సినిమాల కంటే రాజకీయ మీదనే ఉండడంతో ఆ స్థానాన్ని సొంతం చేసుకోలేకపోయాడు.
Sr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..
ఇక మిగిలిన టాలీవుడ్ టాప్ హీరోస్.. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు.. వీళ్లంతా కూడా ఇప్పటికీ చిరునే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అని చెప్పడం కొసమెరుపు. మరి ఎన్టీఆర్, చిరు తర్వాత ఆ టాప్ హీరో కుర్చీని దక్కించుకుని, సిల్వర్ స్క్రీన్ పై సామ్రాజ్యాన్ని నిర్మించుకునే నయా నవాబ్ ఎవరో కాలమే నిర్ణయించాలి..!