Suspension of former DGP Anjani Kumar revoked : తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ పై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెల్సిందే. తాజాగా అంజనీ కుమార్ పై సస్పెన్షన్ను రద్దు చేసింది ఎన్నికల సంఘం. ఈ నెల ప్రారంభంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా.. ఓట్ల లెక్కింపు జరుగుతుండగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో పరామర్శించారు. పుష్పగుచ్ఛం అందించి, అభినందించారు.
బహిష్కరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా మోయిత్రా..
ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. డీజీపీ చర్యలు జూనియర్ అధికారులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఈసీఐ ఈ సమావేశాన్ని స్పష్టమైన కోడ్ ఉల్లంఘనగా పరిగణించింది. అయితే దీనిపై ఈసీకి అంజనీ కుమార్ వివరణ ఇచ్చుకున్నారు. ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని, ఇలా మరోసారి జరగదని ఆయన ఈసీకి హామీ ఇచ్చారు.
వచ్చే పదేళ్ళలో గౌతమ్ ఆదానీ ₹7 లక్షల కోట్ల భారీ పెట్టుబడి..
దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న భారత ఎన్నికల సంఘం సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంజనీ కుమార్ సస్పెన్షన్ తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తాకు తెలంగాణ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.