90’s – A Middle Class Biopic : నవీన్ మేడారం.. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేరు. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన ‘డెవిల్’ మూవీకి డైరెక్టర్‌గా తొలుత నవీన్ మేడారం ఉన్నారు. మూవీ అనౌన్స్‌మెంట్‌తో పాటు రెండు పోస్టర్లలో నవీన్ మేడారం పేరు కనిపించింది. అయితే మధ్యలో ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి మధ్య ఇగో వార్ జరగడంతో నవీన్ మేడారంని తప్పించారని వార్తలు వచ్చాయి.
Naga Chaitanya Thandel : ఆ రెండు సినిమాల్ని కలిపి కొడుతున్న చైతూ… తండేల్ వర్కవుట్ అయితేనా..
రిలీజ్‌కి ముందు సినిమా మొత్తం నేనే డైరెక్ట్ చేశానని, 18 ఏళ్ల అనుభవం ఉన్న నాకు.. సినిమా తీయడం పెద్ద కష్టం కాదని కామెంట్ చేశాడు నిర్మాత అభిషేక్ నామా… అయితే ‘డెవిల్’ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డానని, 105 రోజుల పాటు షూటింగ్ కూడా తానే చేశానని నవీన్ మేడారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. డిసెంబర్ 29న రిలీజ్ అయిన ‘డెవిల్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా ‘సలార్’ వల్ల పెద్దగా కలెక్షన్లు సాధించలేక, డిజాస్టర్‌గా మిగిలింది.
‘డెవిల్’ సినిమా విషయంలో డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోలేకపోయిన నవీన్ మేడారం, నిర్మాతగా ‘#90s- A Middle class biopic’ వెబ్ సిరీస్‌తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు.ఆదిత్య హసన్ అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేసిన #90s వెబ్ సిరీస్ అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ప్రతీ మిడిల్ క్లాస్ వ్యక్తి చిన్నతనాన్ని, అద్భుతంగా ఆవిష్కరించడంలో ఈ వెబ్ సిరీస్.. 100 మార్కులు దక్కించుకుంది. దీంతో డైరెక్టర్‌గా తొక్కేసినా, నిర్మాతగా నవీన్ మేడారం సూపర్ సక్సెస్ అయ్యాడు..