Sankranthi Movies 2024 : డిసెంబర్ 21న డంకీ, 22న సలార్ విడుదల అయితేనే థియేటర్ల విషయంలో నానా రచ్చ జరిగింది. సౌత్‌లో డంకీ మూవీకి థియేటర్లు దొరకలేదు. నార్త్‌లో షారుక్ మూవీ ఎక్కువ థియేటర్లు కబ్జా చేయడంతో సలార్‌కి తగినన్ని థియేటర్లు దక్కలేదు. అలాంటిది 2024 జనవరి రెండో వారంలో ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో ఓ పాన్ ఇండియా మూవీ కాగా మిగిలివన్నీ తెలుగులోనే రిలీజ్ అవుతున్నాయి..
మహేష్ బాబు, 2023లో సినిమా రిలీజ్ చేయలేదు. దీంతో 2024 సంక్రాంతికి వస్తున్న ‘గుంటూర్ కారం’ మూవీపైన ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు బాబు ఫ్యాన్స్. అదీకాకుండా గుంటూర్ కారం షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనేక వాయిదాలు పడుతూ, హీరోయిన్లు మారడం, కెమెరామెన్లు మారడం, ఫైట్ మాస్టర్లు మారడం.. ఇలా అనేక మార్పులు జరుగుతూ వచ్చాయి. కాబట్టి మహేష్ మూవీపై చాలా క్రేజ్ వచ్చేసింది..
‘జల్సా’ కోసం మహేష్.. ‘గుంటూరు కారం’ కి తిరిగి ఇచ్చేస్తున్న పవన్ కళ్యాణ్..
హనుమాన్ ట్రైలర్ చూసిన తర్వాత హైప్ పెరిగిపోయింది. రవితేజ ‘ఈగల్’ మూవీ కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. మరోపక్క సీనియర్లు వెంకీ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామి రంగ’ మూవీస్ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసేలా ఉన్నాయి.
ఇన్ని సినిమాలు ఒకే వారంలో 3 రోజుల గ్యాప్‌లో రిలీజ్ అయితే,థియేటర్ల సమస్య రావడం పక్కా. ఇప్పుడు టాలీవుడ్‌లో దీని గురించే చర్చ జరుగుతోంది. నిర్మాత దిల్ రాజు, ఐదు సినిమాల నిర్మాతల సినిమా రిలీజ్ గురించి చర్చించారు. వీటిల్లో ఒక్క సినిమా అయినా ఓ వారం ముందు వస్తే బాగుంటుందని నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఎవ్వరూ కూడా సంక్రాంతి సీజన్ నుంచి ముందుకి వెనక్కి రావడానికి ఒప్పుకోవడం లేదు.