కొత్త కుర్రాళ్లు, సూపర్ హిట్లు కొట్టారు.. 2023 ఏడాది వాళ్లకి బాగా కలిసి వచ్చిందిగా..

2023 Hit Debute Directors : 2023 ఏడాదిలో తెలుగులో సక్సెస్ రేటు బాగా పెరిగింది. ఈ ఏడాది ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ వంటి హీరోలు సినిమాలు రిలీజ్ చేయకపోయారు. మొత్తంగా 160కి పైగా సినిమాలు విడుదల కాగా, అందులో 15 శాతం సక్సెస్ రేటు సాధించింది టాలీవుడ్.

సీనియర్లు బాలయ్య బాబు, చిరంజీవి ఈ ఏడాది రెండేసి సినిమాలు రిలీజ్ చేశారు. బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ రెండు సినిమాలతో వచ్చి సక్సెస్ సాధించాడు. చిరంజీవి, సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో సూపర్ హిట్టు కొట్టినా, ‘భోళా శంకర్’ డిజాస్టర్‌గా నిలిచింది.

యూట్యూబ్ స్టార్లతో సూపర్ హిట్లు! ఈ ఐడియా ఏదో భలేగా ఉందే..

ఈ ఏడాది ఇండస్ట్రీకి వచ్చిన కొత్త కుర్రాళ్లు, మంచి సక్సెస్ అందుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘దసరా’ ఫేమ్ శ్రీకాంతో ఓదెల. క్లాస్ హీరో నానితో ఊర మాస్ ‘దసరా’ మూవీ తీసిన శ్రీకాంత్, రూ.117 కోట్ల కలెక్షన్లు సాధించాడు.

టాలీవుడ్ ఓ బిగ్ బాస్ హౌస్ అయితే వెంకటేష్ పక్కా సేఫ్ గేమ్ ప్లేయర్..

అలాగే ‘హాయ్ నాన్న’ మూవీతో శౌర్యవ్ అనే మరో కొత్త టాలెంటెడ్ డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నాని. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘MAD’మూవీతో కళ్యాణ్ శంకర్ సూపర్ హిట్టు కొట్టాడు. ‘బలగం’ మూవీతో డైరెక్టర్‌గా మారిన జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి, మొత్తం సినిమాతోనే సూపర్ సక్సెస్ సాధించాడు. అలాగే సుహాస్‌తో ‘రైటర్ పద్మభూషణ్’ తీసిన షణ్ముఖ ప్రశాంత్ కూడా ఎమోషన్స్‌కి చక్కగా మేనేజ్ చేశాడు..

‘ఆదికేశవ’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మేము ఫేమస్’, ‘బెదురులంక 2012’ వంటి సినిమాలతో మరికొంత మంది కొత్త దర్శకులు తెలుగులోకి వచ్చారు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post