AAP’s Chahat Pandey : సినిమాలు, రాజకీయాలు ఒక్కటి కాదు. అందుకే రంగుల ప్రపంచంలో సూపర్ సక్సెస్ అయినా చాలా మంది, పూటకో రంగు మార్చే రాజకీయాల్లో నిలవలేకపోయారు. సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి, రాజకీయాల్లోకి వచ్చిన వారికి కూడా సక్సెస్ అందని ద్రాక్షగానే మిగిలింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ రావాలంటే ఏం చేసినా చెల్లుతుంది, అయితే ఎలక్షన్లలో ఓట్లు రాలాలంటే మాత్రం ఓటర్లను ఆకట్టుకునేందుకు అడ్డమైన పనులన్నీ చేయాల్సిందే..
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం అందుకుంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీలో నిలిచింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, టీవీ నటి చాహాత్ పాండేకి టికెట్ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ, దామో నియోజికవర్గంలో నిలబెట్టింది.
జైలుకి వెళ్లి వస్తే చాలు, సీఎం పదవి! అప్పుడు జగన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, నెక్ట్స్ బాబు..?
ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జయంత్ మలాలియా బంపర్ మెజారిటీతో గెలవగా, కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. ఆప్ పార్టీ అభ్యర్థి చాహాత్ పాండే, కేవలం 2275 ఓట్లు మాత్రమే సాధించి, డిపాజిట్ కూడా కోల్పోయింది. చాహాత్ మనీ పాండేకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అందులో 1 శాతం ఓటు వేసినా 12 వేల ఓట్లు రావాలి. అయితే గ్లామర్ చూపించి, సోషల్ మీడియా ఫాలోవర్లను పెంచుకున్నంత ఈజీగా, ఓట్లను తెచ్చుకోవడం వీలు కాదని మరోసారి ఓటర్లు నిరూపించారు..